Chhaava: 'ఛావా' తెలుగు ట్రైల‌ర్‌పై గీతా ఆర్ట్స్ కీల‌క అప్‌డేట్‌

Chhaava Telugu Trailer Drops on March 3rd at 10 AM Says Geetha Arts
  • విక్కీ కౌశల్, ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ కాంబోలో 'ఛావా'
  • శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా
  • తెలుగులో 'ఛావా'ను విడుదల చేస్తున్న‌ గీతా ఆర్ట్స్
  • ఈనెల 3న ఉద‌యం 10 గంట‌ల‌కు ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • మార్చి 7న తెలుగులో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ మూవీ
బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్, ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ తాజా చిత్రం 'ఛావా'. మరాఠా యోధుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఛావా.. బాక్సాఫీస్ వద్ద కాసులవ‌ర్షం కురిపిస్తోంది. మడాక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై దినేశ్‌ విజన్ నిర్మించిన ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించారు.

కాగా, బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌తో దూసుకెళుతున్న 'ఛావా'ను టాలీవుడ్‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌... మార్చి 7న తెలుగులో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు తెలుగు ట్రైల‌ర్ విడుద‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 3న ఉద‌యం 10 గంట‌ల‌కు ఛావా తెలుగు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు 'ఎక్స్'  (ట్విట్ట‌ర్‌) వేదికగా బీజీఎంతో కూడిన స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.
Chhaava
Chhaava Telugu Trailer
Geetha Arts
Tollywood

More Telugu News