AP Budget: నేడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఏపీ ప్ర‌భుత్వం

Today Introduce The Annual Budget in The AP Assembly
  • ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర కేబినెట్‌ భేటీ
  • ఈ స‌మావేశంలో బ‌డ్జెట్‌కు ఆమోదముద్ర‌
  • ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న మంత్రి ప‌య్యావుల
  • సుమారు రూ. 3.20 ల‌క్ష‌ల కోట్ల అంచ‌నాల‌తో రాష్ట్ర బ‌డ్జెట్
ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌, మండ‌లిలో మంత్రి కొల్లు ర‌వీంద్ర బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. సూప‌ర్ 6 ప‌థ‌కాలు, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి బ‌డ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

2025-26కు సంబంధించి సుమారు రూ. 3.20 ల‌క్ష‌ల కోట్ల అంచ‌నాల‌తో ఈ బ‌డ్జెట్ ఉంటుందని స‌మాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుప‌ర‌చ‌డమే ల‌క్ష్యంగా బ‌డ్జెట్‌ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రిమండ‌లి భేటీ కానుంది. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్‌ను ఆమోదించ‌నున్నారు. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.  
AP Budget
Chandrababu
Andhra Pradesh

More Telugu News