Rajamouli: దర్శకుడు రాజమౌళి టార్చర్ భరించలేపోతున్నా... ఆత్మహత్య చేసుకుంటా: శ్రీనివాసరావు

Director Rajamouli is torturing me says Srinivasa Rao
  • రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీనివాసరావు
  • రాజమౌళితో 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని వెల్లడి
  • రాజమౌళిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నపం
తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళిపై ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని... ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోతో పాటు ఒక లేఖను కూడా విడుదల చేశారు. 

తనకు రాజమౌళితో 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని చెప్పారు. రాజమౌళిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. రాజమౌళిపై శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.
Rajamouli
Tollywood

More Telugu News