Posani Krishna Murali: ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళి
- పోసానిని ఓబులవారిపల్లె పీఎస్ కు తరలించిన పోలీసులు
- పీఎస్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం
- అనంతరం రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశ పెట్టనున్న పోలీసులు
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపటి క్రితం ఆయనను పీఎస్ లోకి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోసాని రావడానికి ముందే పోలీస్ స్టేషన్ కు ప్రభుత్వ వైద్యుడు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత పోసానిని రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు పీఎస్ లోకి వెళుతున్న సమయంలో... 'పోసానిగారూ... మీ అరెస్ట్ గురించి ఏమైనా చెపుతారా?' అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఆయన సమాధానం ఇవ్వకుండా నమస్కారం పెడుతూ లోపలకి వెళ్లిపోయారు. ఓబులవారిపల్లె పీఎస్ వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ వర్గీయులు చేరుకున్నారు. వీరందరినీ పీఎస్ నుంచి దూరంగా పోలీసులు పంపించారు. మరోవైపు పోసాని భార్య కుసుమలతకు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు.