Litton Das: శివ‌లింగాల‌కు బంగ్లాదేశ్ క్రికెట‌ర్ అభిషేకం

Litton Das Maha Shivaratri Celebrations Tweet goes Viral
  • మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శివాల‌యంలో లిట్ట‌న్ దాస్ పూజ‌లు
  • అందుకు సంబంధించిన ఫొటోల‌ను త‌న 'ఎక్స్' ఖాతా ద్వారా పంచుకున్న క్రికెట‌ర్‌
  • ఇటీవల బంగ్లాలో హిందువుల‌పై జ‌రిగిన దాడుల్లో దాస్ ఇంటిని ధ్వంసం చేసిన ఆందోళనకారులు 
  • అయిన‌ప్ప‌టికీ ఆల‌యానికి వెళ్లి పూజలు చేసి ట్వీట్ చేయ‌డంపై నెట్టింట ప్ర‌శంస‌లు
ఈరోజు మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా బంగ్లాదేశ్ క్రికెట‌ర్ లిట్టన్ దాస్ శివ‌లింగాల‌కు అభిషేకం చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోల‌ను తన 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా షేర్ చేశాడు. బంగ్లాదేశ్ హిందూ కుటుంబానికి చెందిన లిట్టన్ దాస్ మహా శివరాత్రి సందర్భంగా ఇలా ప్రత్యేకంగా శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగాలకు పూజలు చేశాడు. 

కాగా, ఇటీవల బంగ్లాలో హిందువుల‌పై జ‌రిగిన దాడుల్లో ఆందోళనకారులు లిట్టన్ దాస్ ఇంటిని కూడా ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంఘటన నుంచి తేరుకుని అతడు ఆల‌యానికి వెళ్లి శివలింగాలకు అభిషేకం చేసి ట్వీట్ చేయ‌డంపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే ద‌క్షిణాఫ్రికాకు చెందిన భార‌త సంత‌తి క్రికెట‌ర్‌ కేశ‌వ్ మ‌హారాజ్ కూడా శివ‌రాత్రి సంద‌ర్భంగా త‌న ఇన్‌స్టా స్టోరీలో శుభాకాంక్ష‌లు తెలుపుతూ పోస్టు పెట్టాడు. 
Litton Das
Maha Shivaratri
Bangladesh

More Telugu News