Chandrababu: ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు: సీఎం చంద్ర‌బాబు

AP CM Chandrababu Naidu Maha Shivaratri Wishes to People
    
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా పోస్టు పెట్టారు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను అంటూ చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 

కాగా, ఏపీ, తెలంగాణ‌లో మ‌హా శివరాత్రి వేడుకలు ఘ‌నంగా ప్రారంభమయ్యాయి. ఇప్ప‌టికే మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా భారీ ఎత్తున భ‌క్తులు ఆల‌యాల‌కు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు త‌గ్గ‌ట్టుగా భారీగానే ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులు తెల్ల‌వారుజామునే ఆలయాలకు తరలివచ్చి శివుడిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిట‌కిట‌లాడుతున్నాయి. 
Chandrababu
Maha Shivaratri
Andhra Pradesh

More Telugu News