పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Telugu compulsory in Telangana schools
  • సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి
  • తొమ్మిదో తరగతికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు
  • పదో తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆదేశించింది.

తొమ్మిదో తరగతి వారికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచించింది. పదో తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Go Back to Shorts
Telangana
School
Government

More Telugu News