Ganta Srinivasa Rao: జగన్ వైఖరి నచ్చకే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు: గంటా శ్రీనివాస్
- జగన్ అసెంబ్లీకి వచ్చి మూసుకుని కూర్చోవాలన్న గంటా
- అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే నిన్న అసెంబ్లీకి వచ్చారని విమర్శ
- వైసీపీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చిన జగన్ అసెంబ్లీకి వచ్చి మూసుకుని కూర్చోవాలని అన్నారు. ప్రజల తీర్పును స్వాగతించకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సీనియర్ నాయకుడని... చంద్రబాబుకు జగన్ సమకాలికుడు కాదనే విషయాన్ని ఆయన గ్రహించాలని హితవు పలికారు.
జగన్ వైఖరి నచ్చకపోవడం వల్లే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. చాలా మంది నేతలు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వచ్చారని దుయ్యబట్టారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలో పాకలపాటి రఘువర్మకు కూటమి పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరారు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే రఘువర్మను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఉపాధ్యాయుల పట్ల గత వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని... మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు.