New Zealand: సిబ్బంది మీద చేయి వేసినందుకు పదవి పోగొట్టుకున్న న్యూజిలాండ్ మంత్రి

New Zealand minister quits after having placed hand on staffers arm
--
న్యూజిలాండ్ మంత్రి ఆండ్రూ బేలీ తన సిబ్బందిపై చేయి వేసినందుకు ఏకంగా పదవినే కోల్పోయాడు. అవును మీరు చదివింది కరెక్టే.. సిబ్బందిపై చేయి వేసినందుకే, చేయి చేసుకోవడం కాదు. ఈ కారణంగానే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ విషయాన్ని ఆండ్రూ బేలీ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఇటీవలే తాను రాజీనామా సమర్పించానని, తాజాగా ప్రధాని క్రిస్టొఫర్ లక్సన్ ఆమోదం తెలిపారని వివరించారు. ఒక చర్చలో భాగంగా మాట్లాడుతూ తన సిబ్బంది భుజంపై చేయి వేశానని ఆండ్రూ చెప్పారు. ఆ సమయంలో తన ప్రవర్తన అహంకారపూరితమైనదేనని అంగీకరించారు. తన సిబ్బంది పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించానని, అలా చేసి ఉండకూడదని విచారం వ్యక్తం చేశారు.

తనను క్షమించాలని ఆయన కోరారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీస్ కేసు నమోదైందని ఆండ్రూ తెలిపారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, ఎంపీగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఆండ్రూ బేలీపై విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదని స్థానిక మీడియా తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆండ్రూ మద్యం సేవించి హాజరయ్యారనే ఆరోపణలు వినిపించాయి. కించపరిచేలా మాట్లాడారని ఓ వర్కర్ ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను ఆండ్రూ తోసిపుచ్చారు. ఆ సమయంలో తాను మద్యం మత్తులో లేనని, తానసలు మద్యం సేవించనే లేదని వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆండ్రూ క్షమాపణలు చెప్పారు.
New Zealand
minister
Resignation
Staff

More Telugu News