Katrina Kaif: కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన కత్రినా కైఫ్

Katrina Kaif attends Maha Kumbh with her mother in law
  • కత్రినా కైఫ్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం
  • పరామర్థ నికేతన్‌లో స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్న కత్రినా కైఫ్
  • కుంభమేళాకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్న కత్రినా కైఫ్
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ప్రముఖ సినీ నటి కత్రినాకైఫ్ పుణ్యస్నానమాచరించారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాలో పాల్గొన్నారు. కత్రినా కైఫ్‌ను చూసేందుకు అక్కడకు వచ్చిన వారు ఎగబడ్డారు. కొంతమంది ఆమెతో సెల్ఫీలు దిగారు.

కత్రినా కైఫ్ సోమవారం నాడు కుంభమేళాలోని పరమార్థ నికేతన్‌కు వచ్చారు. ఆధ్యాత్మిక గురువులు స్వామి చిదానంద సరస్వతి, సాధ్వి భగవతి సరస్వతి ఆశీర్వాదాలను తీసుకున్నారు. కత్రినా కైఫ్ గులాబీ రంగు దుస్తులు ధరించారు. ఆమె అత్త వీణా కౌశల్ కూడా స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నారు.

కత్రినా కైఫ్ మాట్లాడుతూ, ఇక్కడకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక్కడకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. స్వామి చిదానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్నానని వెల్లడించారు. ఈరోజు ఇక్కడ గడపాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
Katrina Kaif
Bollywood
Kumbh Mela

More Telugu News