Kichcha Sudeep: తెరంగేట్రం చేయనున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కుమార్తె

kichcha sudeeps daughter sanvi ready to make her mark in the film industry
  • ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సాన్వీ సుదీప్
  • పాటలపై ఆసక్తితో మ్యూజిక్ ఆల్బమ్ చేసిన వైనం
  • సాన్వీ హీరోయిన్‌గా వెండితెరకు రానుందంటూ కన్నడ సినీ వర్గాల్లో టాక్
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కుమార్తె సాన్వీ సుదీప్ త్వరలో వెండితెరపై అరంగేట్రం చేయనున్నారనే వార్త కన్నడ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తన అందంతో ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాన్వీ పేరు ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో మారుమోగుతోంది.

త్వరలోనే సాన్వీ హీరోయిన్‌గా సినిమాల్లోకి రానుందని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, తనకు నటన కంటే పాటలు పాడటమే ఎక్కువ ఇష్టమని సాన్వీ ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పింది. ఆ నేపథ్యంలోనే సాన్వీ ఒక మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేసింది. అంతేకాకుండా జిమ్మీ అనే సినిమాలో ఓ పాట కూడా పాడిందని సమాచారం.

ఇక, హీరో కిచ్చ సుదీప్ విషయానికి వస్తే ఆయన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత సుదీప్ కన్నడలో నటించిన సినిమాలు తెలుగులో కూడా అనువాదం అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన సుదీప్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. కన్నడ స్టార్ హీరోగా బిజీగా ఉంటూనే, కన్నడ బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 
Kichcha Sudeep
Sanvi Sudeep
Kannada Film Industry

More Telugu News