Team India: పాక్ తో హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్... ఫొటోలు ఇవిగో!

Team India practice for match with Pakistan in Champions Trophy
  • ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు భారత్ × పాకిస్థాన్
  • దుబాయ్ లో మ్యాచ్
  • కోచ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు (ఫిబ్రవరి 23) అసలు సిసలైన మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు, దాయాదులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం జరిగే మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు దుబాయ్ స్టేడియం వేదికగా నిలవనుంది. 

గత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. అందుకోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. నేడు టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. 

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మాన్ గిల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఉల్లాసంగా కనిపించారు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, షమీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా మైదానంలో చెమటోడ్చారు. 

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్ ను పర్యవేక్షించారు.
Team India
Pakistan
Champions Trophy 2025
ICC
Dubai

More Telugu News