Garbage Tax: చెత్త పన్నుకు ముగింపు పలికిన ఏపీ ప్రభుత్వం... గెజిట్ జారీ

AP Govt issues gazette to abolish garbage tax
  • చెత్త పన్ను విధించిన గత వైసీపీ ప్రభుత్వం
  • గత డిసెంబర్ 31న చెత్త పన్నును రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
  • తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్త పన్నును ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ విడుదల చేసింది. ఏపీలో ఇకపై చెత్త పన్ను ఉండదు. 

వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నును విధించినప్పటి నుంచి అప్పుడు విపక్షంలో ఉన్న నేతలు విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకున్నారు. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసింది. 
Garbage Tax
Andhra Pradesh

More Telugu News