Cricket: క్యాచ్ వదిలేసి హ్యాట్రిక్ మిస్ చేసిన రోహిత్ శర్మ.. అక్షర్ పటేల్‌కు డిన్నర్ ఆఫర్ చేసిన కెప్టెన్

Rohit Sharma taking Axar Patel out for dinner in Dubai
  • బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ మిస్ చేసిన రోహిత్ శర్మ
  • సులువైన క్యాచ్‌ని వదిలేశానని బాధను వ్యక్తం చేసిన రోహిత్ శర్మ
  • క్లిప్‌లో సిద్ధంగానే ఉన్నానని అయినప్పటికీ అలా జరిగిపోయిందని వ్యాఖ్య
భారత బౌలర్ అక్షర్ పటేల్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దుబాయ్‌లో డిన్నర్ ఆఫర్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బౌలింగులో వచ్చిన క్యాచ్‌ను రోహిత్ శర్మ వదిలేశాడు. అప్పటికే రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయింది. దీంతో రోహిత్ శర్మ వెంటనే క్షమాపణలు చెబుతున్నట్లు సైగ చేశాడు.

ఆ క్యాచ్‌ను వదిలివేయడంపై ఆ తర్వాత కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అది చాలా సులువైన క్యాచ్ అని, దానిని తాను పట్టుకోవాల్సిందని అన్నాడు. క్యాచ్ పట్టుకోవడానికి స్లిప్‌లో సిద్ధంగానే ఉన్నానని, కానీ అలా జరిగిపోయిందని బాధను వ్యక్తం చేశాడు. అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్‌ను దూరం చేసినందుకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు. బహుశా అతడిని డిన్నర్‌కు తీసుకు వెళతానేమో అని అన్నాడు.
Cricket
Rohit Sharma
Team India
Bangladesh

More Telugu News