Chandrababu: తెలంగాణ నేతల జలదోపిడి ఆరోపణలపై స్పందించిన చంద్రబాబు

Chandrababu responds on TG congress leaders comments
  • ఏపీ జల దోపిడీకి పాల్పడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురి ఆరోపణ
  • కృష్ణా జలాల్లో అధిక నీటిని వాడుకుంటున్నామనే ఆరోపణలను కొట్టిపారేసిన చంద్రబాబు
  • వాటా మేరకే నీటిని వినియోగించుకుంటున్నట్లు వెల్లడి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి పాల్పడుతోందంటూ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక నీటిని వాడుకుంటుందన్న తెలంగాణ నేతల వాదనలో ఎటువంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన వాటా మేరకే నీటిని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గోదావరి నదిలో మిగులు జలాలు పుష్కలంగా ఉన్నాయని, సముద్రంలో కలిసే నీటిని మాత్రమే అదనంగా వాడుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో మాత్రం కొంత సమస్య ఉందని, దీనికి సత్వర పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Chandrababu
Telangana
Andhra Pradesh
Uttam Kumar Reddy

More Telugu News