Samsung Galaxy F05: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05పై బంపర్ డిస్కౌంట్... చాలా చవక

Flipkart offers bumper discount on Samsung Galaxy F05
  • శాంసంగ్ ఫోన్లలోబాగా ప్రజాదరణ పొందిన గెలాక్సీ ఎఫ్05
  • ఫ్లిప్ కార్ట్ లో బంపర్ డిస్కౌంట్
  • రూ.6,299కే ఫోన్
  • బ్యాంకు కార్డులపై మరింత చవకగా లభించే అవకాశం
టెక్ అండ్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్లలో గెలాక్సీ ఎఫ్05 బాగా ప్రజాదరణ పొందింది. ప్రముఖ ఈ-కామర్స్ పోర్టళ్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఎక్కువగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. సాధారణంగా ఈ ఫోన్ ను రూ.9,999 వద్ద విక్రయిస్తుంటారు. తాజాగా, దీనిపై ఫ్లిప్ కార్ట్ లో బంపర్ డిస్కౌంట్ ప్రకటించారు. 

ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్05 ఫోన్ కేవలం రూ.6,299కే లభిస్తుంది. కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల సాయంతో ఇంకా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. 

4జీబీ ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజి (1 టీబీ వరకు పెంచుకోవచ్చు), 6.74 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే,  50ఎంపీ+2ఎంపీ రియర్ కెమెరా సెటప్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, హీలియో జీ85 ప్రాసెసర్, 4జీ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ దీని ప్రత్యేకతలు.

కాగా, ఇది పరిమితకాలపు ఆఫర్. ఈ ఆఫర్ మరి కొన్ని గంటల్లో ముగియనుంది.
Samsung Galaxy F05
Discount
Flipkart
Smart Phone

More Telugu News