Weight Lifter: 270 కిలోల రాడ్డు మీదపడి మహిళా వెయిట్ లిఫ్టర్ మృతి

Gold medallist powerlifter Yashtika Acharya dies in Bikaner gym after heavy weightlifting rod slips during training
  • జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా యష్తిక ఆచార్య మృతి
  • రాడ్డు మీద పడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
  • అప్పటికే ప్రాణాలు విడిచినట్లు ధృవీకరించిన వైద్యులు
ప్రమాదవశాత్తు 270 కిలోల రాడ్డు మెడ మీద పడటంతో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో వెయిట్ లిఫ్టర్ యష్తిక ఆచార్య మృతి చెందింది. 17 ఏళ్ల ఆచార్య జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాడ్డు మీద పడటంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆచార్య గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణపతకాన్ని గెలుచుకుకుంది. ఈ ఘటనలో శిక్షకుడికి కూడా స్వల్పంగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
Weight Lifter
wrestling
Rajasthan

More Telugu News