Chandrababu: శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

Srisaialam tempe authorities invites CM Chandrababu to Brahmotsavams
  • ఈ నెల 26న మహా శివరాత్రి
  • శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు
  • సీఎం చంద్రబాబుకు ఆహ్వానపత్రిక అందించిన శ్రీశైలం ఆలయ ఈవో
ఈ నెల 26న మహా శివరాత్రిని పురస్కరించుకుని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా, శ్రీశైలం మల్లన్న బ్రహోత్సవాలకు రావాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. 

ఇవాళ ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసిన శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయ వేద పండితులు సీఎం చంద్రబాబుకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ప్రసాదాన్ని అందించి వేదాశీర్వచనం పలికారు. సీఎంను కలిసిన వారిలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.
Chandrababu
Srisaialam Brahmotsavams
Maha Sivaratri

More Telugu News