KTR: ఎల్లుండి సామాజిక సేవా కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపు

KTR calls for social service on KCR birthday
  • 17వ తేదీన కేసీఆర్ పుట్టిన రోజు
  • రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు
  • రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, అన్నదానం చేయాలన్న కేటీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఎల్లుండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

ఈనెల 17వ తేదీన పార్టీ శ్రేణులు ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
KTR
Telangana
BRS
KCR

More Telugu News