Gold: భారీగా పెరిగిన బంగారం ధర.. రూ. 90 వేలకు చేరువలో పసిడి!

Gold rate crossed Rs 89 thousand and silver touched one lakh
  • నిన్న ఒక్క రోజే రూ. 1,300 పెరిగిన ధర
  • దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ. 89,400కు చేరిక
  • లక్ష రూపాయలకు చేరుకున్న కిలో వెండి ధర
గత కొన్ని రోజులుగా బంగారం ధర నేల విడిచి ఆకాశం దిశగా పయనిస్తోంది. దేశీయ మార్కెట్లో నిన్న తొలిసారి 10 గ్రాముల బంగారం ధర రూ. 89 వేల మార్కును దాటేసింది. నిన్న ఒక్క రోజే రూ. 1,300 పెరగడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 89,400కు చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో రూ. 85 వేల మార్కును తాకిన పసిడి ధర 15 రోజుల్లోనే రూ. 90 వేలకు చేరువకావడం గమనార్హం. హోల్‌సేల్, రిటైల్ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇక, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,160గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,900కు చేరుకుంది. ఇక వెండి ధర కూడా నిన్న కిలోకు రూ. 2 వేలు పెరగడంతో 4 నెలల గరిష్ఠాన్ని తాకుతూ లక్ష రూపాయలకు చేరుకుంది. 
Gold
Silver
Gold Rates
Bullion Market
Hyderabad Markets
Business News

More Telugu News