Srinivasa Varma: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ

Sreenivasa Varma gave clarity on Vizag Steel plant privatisation
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదన్న శ్రీనివాస వర్మ
  • చంద్రబాబు, లోకేశ్ కృషి వల్ల ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందన్న కేంద్ర సహాయ మంత్రి
  • ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని వెల్లడి
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. కొన్ని కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పారు. దేశంలోనే అత్యున్నతమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని చెప్పారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి చెప్పారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,400 కోట్ల ప్యాకేజీని ఇచ్చిందని తెలిపారు. ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Srinivasa Varma
Vizag Steel Plant

More Telugu News