Kanagal: పరీక్షల్లో 10 జీపీఏ సాధిస్తే విమానం ఎక్కిస్తా.. నల్గొండ కలెక్టర్ బంపర్ ఆఫర్

Nalgonda Collector Ila Tripathi Surprise Visit Kanagal Kasthurbha Residential School
  • కనగల్ కస్తుర్భా హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ 
  • బుధవారం రాత్రి విద్యార్థులతో ఇలా త్రిపాఠి ముఖాముఖి
  • వారితో కలిసి భోజనం చేసి సెల్ఫీ దిగిన కలెక్టర్
నల్గొండ జిల్లాలోని కనగల్ కస్తూర్భా గాంధీ విద్యార్థినులకు కలెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధిస్తే విమానం ఎక్కిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకెళతానని చెప్పారు. బుధవారం రాత్రి కనగల్ కస్తూర్భా హాస్టల్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి, కిచెన్, హాస్టల్ రూంలను పరిశీలించారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షలకు బాగా చదువుకోవాలని సూచించారు. మంచి మార్కులు తెచ్చుకుంటే విమానం ఎక్కిస్తానని చెప్పారు. ఆపై వారితో కలిసి సెల్ఫీ దిగారు. కలెక్టర్ తో పాటు ఎంఈవో వసుమలత, కస్తూర్భా పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు.
Kanagal
Kasturbha Hostel
Nalgonda
Ila Tripathi
Flight journey
Tenth Class Students

More Telugu News