cruise ship tour: ఏపీ పర్యాటకుల కోసం క్రూయిజ్ నౌక రాకపోకల వివరాలు ఇవే

cruise ship tour to be start from chennai to vizag on jun 30th
  • చెన్నై – విశాఖ – పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ నౌక
  • జూన్, జులైలో పర్యాటకులకు అందుబాటులోకి 
  • మూడు సర్వీసుల్లో భాగంగా తొలి సర్వీస్ జూన్ 30న చెన్నై నుంచి విశాఖకు
పర్యాటకుల కోసం అతి పెద్ద క్రూయిజ్ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో చెన్నై – విశాఖ – పుదుచ్చేరి మద్య కార్డెల్లా క్రూయిజ్ నౌకను నడుపనున్నారు. బుధవారం విశాఖలో నిర్వహించిన ట్రావెల్ ఏజెంట్ల సమావేశంలో నిర్వాహకులు కార్డెల్లా క్రూయిజ్ నౌక ప్రయాణ వివరాలు వెల్లడించారు. 

మూడు సర్వీసుల్లో భాగంగా తొలిసారి జూన్ 30న చెన్నైలో బయలుదేరి జులై 2న విశాఖ చేరుతుందని, అదే రోజు అక్కడ నుంచి బయలుదేరి 4న పుదుచ్చేరి వెళుతుందని చెప్పారు. 4న పుదుచ్చేరిలో బయలుదేరి 5న చెన్నైకి చేరుతుందని చెప్పారు. రెండో సర్వీసుగా జూలై 7న చెన్నైలో బయలుదేరి 9న విశాఖకు, 11న పుదుచ్చేరి, అక్కడ నుంచి 12న చెన్నైకి వెళ్తుందని తెలిపారు. 

మూడో సర్వీసుగా జులై 14న చెన్నైలో బయలుదేరి 16న విశాఖకు, అక్కడ నుంచి 18న పుదుచ్చేరి చేరుకుని, 19న చెన్నైకి చేరుతుందని వెల్లడించారు. అతి పెద్ద క్రూయిజ్ నౌకలో ప్రయాణం చేసేందుకు అనేక మంది పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకు ముందు విశాఖ తీరానికి చేరుకున్న క్రూయిజ్ నౌకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన సంగతి తెలిసిందే. పర్యాటకుల ఆసక్తి నేపథ్యంలో క్రూయిజ్ నౌకను నిర్వహకులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.    
cruise ship tour
cruise ship
vizag
chennai

More Telugu News