Bengaluru: అగ్గిపెట్టె అంత రూమ్ కు పాతిక వేల రెంట్.. బెంగళూరులో అద్దె కష్టాలు
--
బెంగళూరులో జీవన వ్యయం చాలా ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఉద్యోగస్తులు నెలనెలా అందుకునే జీతంలో దాదాపు సగం ఇంటి అద్దెకే చెల్లించాల్సిన పరిస్థితి ఉందట. ఇంకా విచిత్రం ఏమిటంటే, భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధపడినా కూడా ఇల్లు అద్దెకు దొరకడం అంత ఈజీ కాదని చాలామంది వాపోతున్నారు. తాజాగా బెంగళూరులో అద్దె ఇంటి కష్టాలను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తాను ఉంటున్న సింగిల్ బెడ్ రూం ఇంటికి సంబంధించి ఓ ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు. గది మధ్యలో నిలుచుని చేతులు చాపితే అటుఇటూ గోడలు తగులుతున్న ఈ రూమ్ బహుశా బెంగళూరు మొత్తానికీ అత్యంత ఖరీదైనదేమో అని కామెంట్ చేశాడు. ఈ చిన్న గదికి నెలకు రూ.25 వేలు అద్దె చెల్లిస్తున్నట్లు వివరించాడు. తన సమస్యలను ఈ పోస్టులో ఫన్నీగా చెప్పుకొచ్చాడు.
ఈ గది వల్ల తను నెలనెలా తన జీతంలో చాలామొత్తం పొదుపు చేస్తున్నానని చెప్పాడు. గది చిన్నగా ఉండడం వల్ల ఎక్కువ వస్తువులు కొనడం తప్పిందని, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వంటి వస్తువులు కొనాలని అనుకున్నా వాటిని ఉంచేందుకు స్థలం లేక ఆ ఆలోచన విరమించుకోవాల్సిందేనని అన్నాడు. అంటే ఆయా వస్తువులకు వెచ్చించాల్సిన సొమ్ము ఆదా అయినట్లేనని అన్నాడు. అదేవిధంగా ఈ చిన్న గదికి రావడానికి ఏ అమ్మాయీ ఒప్పుకోదు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ ను మెయింటెయిన్ చేసే అవకాశం కూడా లేదన్నాడు. తద్వారా ఆమె షాపింగ్ కు, సినిమాలకు షికార్లకు అయ్యే ఖర్చు కూడా మిగిలినట్లేనని వివరించాడు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో బ్యాచిలర్ లైఫ్ కు ఈ రూమ్ పర్ ఫెక్ట్ గా సరిపోతుందని చెప్పగా మరికొందరేమో తమ బాత్రూమ్ ఇంతకన్నా పెద్దగా ఉంటుందని అంటున్నారు. ముంబైలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని, ఇంకొంత కాలం తర్వాత పూణేలోనూ ఇదే పరిస్థితి నెలకొంటుందని మరో యూజర్ చెప్పుకొచ్చాడు.