Damodara Raja Narasimha: హైదరాబాద్ ఆసుపత్రిలో మృతదేహానికి చికిత్స వార్తలు.. స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ

Minister Rajanarsimha responds on treatment to dead body
  • మదీనాగూడలోని సిద్ధార్థ ఆసుపత్రిలో ఘటన
  • మృతదేహానికి రెండు రోజులుగా చికిత్స చేస్తున్నట్లు వార్తలు 
  • మంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రిలో తనిఖీలు
హైదరాబాద్‌లోని మదీనాగూడలో ఒక ఆసుపత్రిలో రెండు రోజులపాటు మృతదేహానికి చికిత్స చేశారన్న ఘటనపై  తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సిద్ధార్థ ఆసుపత్రిలో రెండు రోజులపాటు మృతదేహానికి చికిత్స చేసినట్లు మీడియాలో కథనాలు రావడంతో మంత్రి స్పందించారు. ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Damodara Raja Narasimha
Telangana
Hospital
Hyderabad

More Telugu News