Congress: ఎల్లారెడ్డి నేత సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెస్

Congress suspended Subash Reddy from party
  • కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యేను, పార్టీని దుర్భాషాలాడారంటూ ఫిర్యాదు
  • సుభాష్ రెడ్డి సమాధానంపై సంతృప్తి చెందని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం
  • బహిష్కరణ ఈరోజు నుండి అమల్లోకి వస్తుందని వెల్లడి
ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో, దీంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.

సుభాష్ రెడ్డి కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును, పార్టీని దుర్భాషలాడినట్లు ఫిర్యాదు అందింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన దుర్భాషలాడినట్లు వెల్లడి కావడంతో అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.

దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ చిన్నారెడ్డి గత ఏడాది నోటీసులు జారీ చేశారు. 2024 నవంబర్ 21 నాటికి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2024 నవంబర్ 20 నాటికి సుభాష్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే, ఆయన సమాధానంపై సంతృప్తి చెందని అధిష్ఠానం ఈరోజు సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. నేటి నుండి బహిష్కరణ అమల్లోకి వస్తుందని పేర్కొంది.
Congress
Telangana
Ellareddy

More Telugu News