Telangana: మస్తాన్‌సాయి వ్యవహారంలో కీలక పరిణామం

Anti narcotic enteres into MasthanSai case
  • ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు
  • మస్తాన్‌సాయి డ్రగ్స్ దందాపై ఆరా తీస్తున్న యాంటీ నార్కోటిక్ బృందం
  • కీలక ఆధారాలు సేకరించిన అధికారులు
రాజ్ తరుణ్, లావణ్య కేసుతోపాటు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో యాంటీ నార్కోటిక్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.

మస్తాన్‌సాయి డ్రగ్స్ దందా గురించి యాంటీ నార్కోటిక్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. టాస్క్‌ఫోర్స్‌తో కలిసి సైబరాబాద్ నార్కోటిక్ బ్యూరో పనిచేస్తోంది.

లావణ్య ఫిర్యాదుతో పోలీసులు మస్తాన్‌సాయిని అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీసులు అతడిని ఏడు రోజుల కస్టడీకి కోరారు. ఈ విచారణలో తెలంగాణ న్యాబ్ పోలీసులు పాల్గొననున్నారు. మరోవైపు, మస్తాన్‌సాయి నిర్వహించిన డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వారికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
Telangana
Hyderabad
Raj Tarun

More Telugu News