Sonu Sood: నటుడు సోనూ సూద్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Ludhiana court issues arrest warrant against bollywood actor Sonu Sood
  • ఓ కేసులో సోనూ సూద్‌ను సాక్షిగా పేర్కొన్న న్యాయవాది
  • పలుమార్లు సమన్లు పంపినా హాజరు కాని నటుడు
  • అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా కోర్టు ఆదేశాలు
మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌పై పంజాబ్‌లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. మోహిత్‌శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో తనతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్‌ఖన్నా కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఆయన సోనూ సూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.

విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూ సూద్‌కు పలుమార్లు సమన్లు పంపినా ఆయన హాజరు కాలేదు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.

కాగా, సోనూ సూద్ ఇటీవలే డైరెక్టర్‌గా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఫతేహ్’ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
Sonu Sood
Bollywood
Ludhiana Court
Punjab

More Telugu News