ఆ రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు: తుమ్మల నాగేశ్వరరావు
- ఎకరం వరకు సాగు చేస్తున్న వారికి నిధులు జమ చేస్తామన్న మంత్రి
- మొత్తం 17.03 లక్షల రైతుల అకౌంట్లలోకి నిధులు జమ
- ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ నిధులు పంపిణీ చేస్తున్నామన్న మంత్రి
ప్రభుత్వం నాలుగు పథకాల అమలులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఆ రోజు సెలవు దినం కావడంతో, మరుసటి రోజు ఒక్కో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా నిధులను చెల్లించారు. 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో రూ. 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి మొదటి విడతగా రూ.6 వేల పెట్టుబడి సాయం అందించింది.