Hotel Sitara: హోటల్ సెల్లార్ గోడ కూలి ముగ్గురి మృతి.. ఎల్బీనగర్ లో ప్రమాదం

Three Construction Workers Died In Sitara Hotel Cellar Wall Collapse
  • మృతులంతా బీహార్ వలస కూలీలే
  • గాయపడిన మరో కూలీ.. ఆసుపత్రికి తరలింపు
  • సితారా హోటల్ లో ప్రమాదం
హైదరాబాద్ లోని ఓ హోటల్ సెల్లార్ లో జరుగుతున్న పునర్నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్ లో తవ్వకాలు జరుపుతుండగా గోడ కూలి, కూలీల మీద పడింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా మరో కూలీకి తీవ్రగాయాలు అయ్యాయి. ఎల్బీ నగర్ లోని సితారా హోటల్ లో జరిగిందీ ప్రమాదం. చనిపోయిన వారంతా బీహార్ వలస కూలీలేనని పోలీసులు వెల్లడించారు. గాయపడిన కూలీని చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hotel Sitara
Cellar
Bihar Workers
LB Nagar
Wall Collapse

More Telugu News