GST: జనవరిలో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. రెండో అత్యధిక వసూళ్లు ఇవే

GST collections soar 12 per cent to  2 lakh crore in January
  • ఏడాది ప్రాతిపదికన 12.3 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లుగా నమోదైన వసూళ్లు
  • 10.4 శాతం పెరిగిన దేశీయ లావాదేవీల వసూళ్లు
  • దిగుమతి వస్తువులపై విధించిన పన్ను ద్వారా 19.8 శాతం పెరిగిన వసూళ్లు
జనవరిలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12.3 శాతం వృద్ధితో రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడంతో జనవరిలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

దేశీయ లావాదేవీల ద్వారా సేకరించిన జీఎస్టీ 10.4 శాతం పెరిగి రూ. 1.47 లక్షల కోట్లకు చేరుకుంది. దిగుమతులపై విధించిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం 19.8 శాతం పెరిగి రూ. 48,382 కోట్లుగా నమోదైంది.

2024 ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 2.10 లక్షల కోట్లుగా నమోదైన తర్వాత రెండో అత్యధిక వసూళ్లు నమోదైన నెలల్లో ఈ జనవరి రెండో స్థానంలో నిలిచింది.

జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ. 1,95,506 కోట్లు కాగా, రీఫండ్స్ కింద రూ. 23,853 కోట్లు విడుదల చేశారు. రీఫండ్స్ అనంతరం సవరించిన జీఎస్టీ వసూళ్లు రూ. 1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.77 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
GST
GST Collections
BJP

More Telugu News