Union Budget 2025-26: కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26: ఏ రంగానికి ఎంతెంత...!

Union Budget sector wise details
  • పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
  • 2025-26 వార్షిక బడ్జెట్ రూ.50,65,345 కోట్లు అని ప్రకటన
  • రక్షణ రంగానికి అత్యధికంగా రూ.4.91 లక్షల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీయే కూటమి సభ్యుల హర్షధ్వనాల మధ్య పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో రికార్డు స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 

ఈసారి రక్షణ రంగానికి రూ.4.91 లక్షల కోట్లతో అత్యధిక కేటాయింపులు చేశారు. మారుతున్న ప్రపంచ సమీకరణాలు, సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక వైఖరి అవలంబించడం, సరికొత్త ఆయుధాల అభివృద్ధి, సైన్యాన్ని పటిష్టం చేయడం వంటి కారణాల రీత్యా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. 

కేటాయింపుల వివరాలు ఇవిగో...
  • రక్షణ రంగం- రూ.4,91,732 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి- రూ.2,66,817 కోట్లు
  • హోంశాఖ- రూ.2,33,211 కోట్లు
  • వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.1,71,437 కోట్లు
  • విద్యా రంగం- రూ.1,28,650 కోట్లు
  • ఆరోగ్య రంగం- రూ.98,311 కోట్లు
  • పట్టణాభివృద్ధి- రూ.96,777 కోట్లు
  • ఐటీ, టెలికాం రంగం- రూ.95,298 కోట్లు
  • ఇంధన రంగం- రూ.81,174 కోట్లు
  • పారిశ్రామిక, వాణిజ్య రంగాలు- రూ.65,553 కోట్లు
  • సామాజిక సంక్షేమ రంగం- రూ.60,052 కోట్లు
  • శాస్త్ర సాంకేతిక రంగం- రూ.55,679 కోట్లు
Union Budget 2025-26
Nirmala Sitharaman
Parliament
India

More Telugu News