Mamta Kulkarni: మమతా కులకర్ణిని బహిష్కరించిన కిన్నార్ అఖాడా

Mamta Kulkarni expelled from Kinnar Akhada
  • కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన మమతా కులకర్ణి
  • ఆమెను మహామండలేశ్వర్ గా నియమించిన లక్ష్మీనారాయణ త్రిపాఠి
  • మమత, త్రిపాఠిలను తొలగించిన కిన్నార్ అఖాడా
బాలీవుడ్ అలనాటి అందాల తార మమతా కులకర్ణి ఇటీవల సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా సమయంలో ఆమె సన్యాసం స్వీకరించారు. కిన్నార్ అఖాడాలో ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె దీక్ష తీసుకున్నారు. ఆమెను మహామండలేశ్వర్ గా నియమించారు. 
 
అయితే మమతా కులకర్ణిని మహామండలేశ్వర్ గా నియమించడం వివాదాస్పదం కావడంతో... తాజాగా ఆమెను కిన్నార్ అఖాడా నుంచి తొలగించారు. ఆమెతో పాటు ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణను కూడా బహిష్కరించారు. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వీరిద్దరిని బహిష్కరించినట్టు సమాచారం. 

తన అనుమతి లేకుండా మమతకు దీక్ష అందించడం, మమతపై గతంలో డ్రగ్స్ కేసు ఉండడం వంటి కారణాలతోనే రిషి అజయ్ దాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Mamta Kulkarni
Bollywood

More Telugu News