Economic Survey 2024-25: లోక్‌స‌భ ముందు ఆర్థిక స‌ర్వేను ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్‌

Finance Minister Nirmala Sitharaman Tables Economic Survey 2024 25
  • బడ్జెట్ కు ముందు ఆర్థిక స‌ర్వేను ఉభ‌య‌స‌భ‌ల ముందు ప్ర‌వేశ‌పెట్ట‌డం ఆన‌వాయతీ
  • మొద‌ట 1950-51 సంవ‌త్స‌రం నుంచి బ‌డ్జెట్‌తో పాటే ఆర్థిక స‌ర్వే
  • 1960 త‌ర్వాత బ‌డ్జెట్‌కు ఒక‌రోజు ముందు ఆర్థిక స‌ర్వే ప్ర‌వేశ‌పెట్టే సంప్ర‌దాయం మొద‌లు
రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశానికి ముందు ఆర్థిక స‌ర్వేను పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల ముందు ప్ర‌వేశ‌పెట్ట‌డం ఆన‌వాయతీ. ఇందులో భాగంగానే తాజాగా లోక్‌స‌భ‌లో ఆర్థిక స‌ర్వేను స‌మ‌ర్పించారు. 

అనంత‌రం స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను శ‌నివారానికి వాయిదా వేశారు. గ‌త సంవ‌త్స‌ర కాలంలో దేశ ఆర్థిక ప‌నితీరును... రాబోయే ఏడాదిలో ఆర్థికంగా ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను ముందుగానే అంచ‌నా వేసి చెప్పేదే ఈ ఆర్థిక స‌ర్వే. మొద‌ట 1950-51 సంవ‌త్స‌రం నుంచి ఆర్థిక స‌ర్వేను బ‌డ్జెట్‌తో పాటే ప్ర‌వేశ‌పెట్టేవారు. 

అయితే, 1960 త‌ర్వాత బ‌డ్జెట్‌కు ఒక‌రోజు ముందు ఆర్థిక స‌ర్వే ప్ర‌వేశ‌పెట్టే సంప్ర‌దాయం మొద‌లైంది. ఆర్థిక మంత్రిత్వ‌శాఖకు చెందిన ఎక‌నామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎక‌న‌మిక్ విభాగం ఈ స‌ర్వేను రూపొందిస్తుంది. 

ఇక‌ రేపు (శ‌నివారం) ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13 వరకు మొద‌టి విడ‌త బ‌డ్జెట్ స‌మావేశాలు... మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వరకు రెండో విడత బడ్జెట్‌ సెషన్స్‌ జరగనున్నాయి.
Economic Survey 2024-25
Nirmala Sitharaman

More Telugu News