Producer Vedaraju: టాలీవుడ్ లో మరో విషాదం.. నిర్మాత వేదరాజు మృతి

Tollywood producer Vedaraju passes away
  • ఈ ఉదయం కన్నుమూసిన వేదరాజు టింబర్
  • కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న వేదరాజు
  • ఈరోజు జరగనున్న అంత్యక్రియలు
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత వేదరాజు టింబర్ కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో కొంత కాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. కోలుకుని, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజే జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వేదరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

'మడత కాజా', 'సంఘర్షణ' వంటి చిత్రాలను వేదరాజు నిర్మించారు. కన్స్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే... సినిమాలపై ఇష్టంతో ఆయన నిర్మాతగా మారారు. మరో చిత్ర నిర్మాణానికి సన్నాహకాలు జరుగుతున్న సమయంలోనే ఆయన మృతి చెందారు.
Producer Vedaraju
Tollywood

More Telugu News