Jayalalithaa: జ‌య‌ల‌లిత ఆస్తి రూ.4వేల కోట్లు.. అంతా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికే!

Karnataka Court Orders Transfer of Jayalalithaa Confiscated Assets to Tamil Nadu Govt
  • ఫిబ్ర‌వ‌రి 14, 15 తేదీల్లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌ని బెంగ‌ళూరు స్పెష‌ల్ కోర్టు ఆదేశం
  • 1,562 ఎక‌రాల భూమి, 27 కిలోల బంగారం, ఇత‌ర విలువైన వ‌స్తువులను అప్ప‌గించ‌నున్న క‌ర్ణాట‌క 
  • ప‌దేళ్ల కింద ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లు 
  • ఇప్ప‌టి మార్కెట్ విలువ ప్ర‌కారం రూ. 4వేల కోట్ల‌పైనే అని అంచనా
దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత ఆస్తిని ఫిబ్ర‌వ‌రి 14, 15 తేదీల్లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి అప్ప‌గించాల‌ని బెంగ‌ళూరు స్పెష‌ల్ కోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు అధికారుల‌ను న్యాయ‌మూర్తి హెచ్ఏ మోహ‌న్ ఆదేశించారు. దీంతో క‌ర్ణాట‌క ప‌రిధిలో ఉన్న 1,562 ఎక‌రాల భూమి, 27 కిలోల బంగారం, 10వేల చీర‌లు, 750 జ‌త‌ల చెప్పులు, వాచ్‌ల‌ను అధికారులు త‌మ‌ళ‌నాడు ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌నున్నారు. 

ప‌దేళ్ల కింద‌ట త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్న స‌మ‌యంలో ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లు కాగా, ఇప్ప‌టి మార్కెట్ విలువ ప్ర‌కారం రూ. 4వేల కోట్ల‌పైనే అని అంచనా. కాగా, ఈ ఆస్తులు, వ‌స్తువులు త‌మ‌కు చెందాలంటూ జ‌య వారసులుగా చెప్పుకుంటున్న జే దీప‌, జే దీప‌క్ వేసిన అర్జీని ఇటీవ‌లే క‌ర్ణాట‌క హైకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. 
Jayalalithaa
Karnataka Court
Tamil Nadu Govt

More Telugu News