HMPV: గుజరాత్‌లో నాలుగేళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ వైరస్

4 year old boy infected HMPV in Ahmedabad
  • గుజరాత్‌లో ఎనిమిదికి చేరిన హెచ్ఎంపీవీ కేసులు
  • రెండు రోజుల క్రితం దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన బాలుడు
  • పరీక్షల్లో హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తింపు
గుజరాత్‌లో నాలుగేళ్ల బాలుడికి హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. బాలుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో గుజరాత్‌లో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బాలుడికి వైద్య సహాయం అందిస్తున్నామని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్య అధికారి భవిన్ సోలంకి తెలిపారు.

అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితం జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఎస్జీవీపీ ఆసుపత్రిలో చేరాడు. తాజాగా, వైద్య పరీక్షల్లో అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు నిర్ధారణ అయింది. బాలుడు విదేశాలకు ప్రయాణించిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు.
HMPV
Gujarat
India

More Telugu News