కుంభమేళా తొక్కిసలాట మృతుల సంఖ్య 30... యూపీ ప్రభుత్వ ప్రకటన
- మహా కుంభమేళాలో విషాద ఘటన
- తొక్కిసలాటలో ప్రాణనష్టం
- ప్రెస్ మీట్ లో వివరాలు తెలిపిన డీఐజీ
ఈ నేపథ్యంలో, మహాకుంభ్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న డీఐజీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందారని వెల్లడించారు. 60 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని, మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.
అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య ఈ తొక్కిసలాట జరిగిందని డీఐజీ పేర్కొన్నారు. బారికేడ్ల ధ్వంసం వల్లే తొక్కిసలాట జరిగిందని వివరించారు. ప్రజలు వివరాలు తెలుసుకునేందుకు '1920' హెల్ప్ లైన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇవాళ కుంభమేళాకు వీఐపీలను ఎవరినీ అనుమతించడం లేదని స్పష్టం చేశారు.