Jasprit Bumrah: 'కోల్డ్ ప్లే' క‌న్స‌ర్ట్‌లో జ‌స్ప్రీత్ బుమ్రా సంద‌డి.. ఇదిగో వీడియో!

Team India Bowler Jasprit Bumrah at Coldplay Concert in Ahmedabad
  • అహ్మ‌దాబాద్‌లో సింగ‌ర్ క్రిస్ మార్టిన్ 'కోల్డ్ ప్లే' క‌న్స‌ర్ట్‌
  • ఈ సంద‌ర్భంగా బుమ్రాపై ఓ స్పెష‌ల్ పాట పాడిన సింగ‌ర్‌
  • క్రిస్ మార్టిన్ సాంగ్‌ను ఆస్వాదించిన బుమ్రా
అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన 'కోల్డ్ ప్లే' క‌న్స‌ర్ట్‌లో టీమిండియా స్టార్ బౌల‌ర్‌ జ‌స్ప్రీత్ బుమ్రా సంద‌డి చేశాడు. ఈ ఈవెంట్‌కు బుమ్రా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. ఈ సంద‌ర్భంగా బుమ్రాపై సింగ‌ర్ క్రిస్ మార్టిన్ ఓ స్పెష‌ల్ పాట కూడా పాడారు. 

"జ‌స్ప్రీత్‌.. మై బ్యూటీఫుల్ బ్ర‌ద‌ర్‌. ది బెస్ట్ బౌల‌ర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్‌. వీ డు నాట్ ఎంజాయ్ యు డెస్ట్రాయింగ్ ఇంగ్లండ్ విత్ వికెట్స్ ఆఫ్ట‌ర్ వికెట్స్" అంటూ ఆల‌పించ‌గా బుమ్రా ఆస్వాదించారు. 

ఇక క‌న్స‌ర్ట్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో బుమ్రా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న తాలూకు వీడియోను కూడా ప్ర‌ద‌ర్శించారు. దీంతో ఒక్క‌సారిగా ప్రేక్ష‌కుల అరుపుల‌తో ఈవెంట్ మార్మోగిపోయింది. 'కోల్డ్ ప్లే' క‌న్స‌ర్ట్‌లో జ‌స్ప్రీత్ బుమ్రా సంద‌డి చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  
Jasprit Bumrah
Coldplay Concert
Ahmedabad

More Telugu News