Draupadi Murmu: ఈ రిప‌బ్లిక్ డే మ‌న‌కు మ‌రింత ప్ర‌త్యేకం: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

On The Occasion of Republic Day President Draupadi Murmu Addressed The Nation
  • గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన రాష్ట్ర‌ప‌తి
  • రాజ్యాంగం అమల్లోకి వ‌చ్చి 75 ఏళ్లు అవుతుంద‌న్న ద్రౌప‌ది ముర్ము 
  • ఇది దేశం మొత్తం గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భ‌మ‌ని వ్యాఖ్య‌
  • భార‌త్ అంత‌ర్జాతీయంగా నాయ‌క‌త్వం వ‌హించేలా ఎద‌గ‌డం గ‌ర్వ‌కార‌ణమ‌న్న రాష్ట్ర‌ప‌తి
గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ రిప‌బ్లిక్ డే మ‌న‌కు మ‌రింత ప్ర‌త్యేక‌మ‌ని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వ‌చ్చి 75 ఏళ్లు అవుతుంద‌ని, ఇది దేశం మొత్తం గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భ‌మ‌ని రాష్ట్ర‌ప‌తి పేర్కొన్నారు. 

భ‌ర‌తమాత విముక్తి కోసం త్యాగం చేసిన వారిని స్మ‌రించుకోవాల‌న్నారు. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జ‌యంతిని జ‌రుపుకున్నామ‌ని, వెలుగులోకి రాని మ‌రికొంద‌రు ధైర్య‌వంతుల‌ను స్మ‌రించుకోవాల‌ని పిలుపునిచ్చారు. 

మారుతున్న కాలానికి అనుగుణంగా చ‌ట్టాల‌ను మార్చుకున్నామ‌ని, ఈ ఏడాది కొత్త చ‌ట్టాల‌ను రూపొందించి అమ‌ల్లోకి తెచ్చామ‌ని రాష్ట్ర‌ప‌తి తెలిపారు. మ‌న ల‌క్ష్యాల దిశ‌గా నిజ‌మైన ప్ర‌యాణం సాగుతుంద‌న్నారు. ఇక భార‌త్ అంత‌ర్జాతీయంగా నాయ‌క‌త్వం వ‌హించేలా ఎద‌గ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణమ‌ని పేర్కొన్నారు.  
Draupadi Murmu
Republic Day
India

More Telugu News