పూణేలో ఘోర ప్రమాదం.. కాంక్రీట్ లారీ కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు మృతి!
మూడు రోడ్ల సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. వేగంగా వెళ్తున్న కాంక్రీట్ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే స్కూటీపై వెళ్తున్న వారిపై అమాంతంగా పడిపోయింది. దాంతో ఆ కాంక్రీట్ లారీ కింద పడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు నుజ్జు నుజ్జయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.