Sankranthiki Vasthunnam: 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంపై ఏపీ హైకోర్టులో పిల్

PIL against Sankranthiki Vasthunnam Movie
  • ఈ సంక్రాంతి సీజన్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం
  • ఈ చిత్రం బడ్జెట్, వసూళ్ల విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందంటూ పిల్
  • ఐటీ, ఈడీ, జీఎస్టీ విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టుకు విజ్ఞప్తి
ఈ సంక్రాంతి సీజన్ లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ చిత్రం బడ్జెట్, వసూళ్ల విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందంటూ ఈ పిల్ లో ఆరోపించారు. ఈ సినిమా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ ఏపీ హైకోర్టును కోరారు. అంతేకాకుండా... ఐటీ, ఈడీ, జీఎస్టీ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. 

విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇప్పటికే దిల్ రాజు నివాసంలో గత నాలుగు రోజులుగా ఐటీ దాడులు నిర్వహించారు. దిల్ రాజు కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టులో పిల్ దాఖలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Sankranthiki Vasthunnam
PIL
Tollywood

More Telugu News