Rajahmundry: రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

Pillars collapsed in Rajahmundry airport
  • నూతన టెర్మినల్ భవనంలో కుప్పకూలిన కొంత భాగం
  • ఆ సమయంలో కార్మికులు అక్కడ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • ఇటీవలే భవన నిర్మాణాలను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు
రాజమండ్రి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనం నిర్మాణంలో ప్రమాదం చోటుచేసుకుంది. నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్పకూలింది. పిల్లర్లు కుప్పకూలడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు కొంత దూరంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.  

మరోవైపు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. నాణ్యతాలోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను ఇటీవలే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఇది జరిగి నెల రోజులు కూడా గడవక ముందే టెర్మినల్ భవనం పిల్లర్లు కుప్పకూలాయి.  
Rajahmundry
Airport

More Telugu News