ఆ పెట్టుబడుల ద్వారా 75 వేల వరకు ఉద్యోగాలు: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శ
- బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్
- ప్రజలను మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడమే బీఆర్ఎస్ పని అని మండిపాటు
దావోస్‌లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లడం వల్ల పెట్టుబడులపై నమ్మకం కుదిరిందన్నారు. తెలంగాణ పెవిలియన్ రద్దీగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. తమని విమర్శించే ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
ప్రజలను మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడమే బీఆర్ఎస్ పని అని విమర్శించారు. గత ప్రభుత్వ పాలన కారణంగా నెలకు ఆరున్నర వేల కోట్ల రూపాయల వడ్డీని కడుతున్నట్లు చెప్పారు. మంచి జరుగుతుంటే ప్రశంసించడం నేర్చుకోవాలని ప్రతిపక్షానికి హితవు పలికారు.