తెలుగు రాష్ట్రాల్లో భారీగా పొగమంచు .. విమానాల రాకపోకలకు అంతరాయం
- గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద గాల్లో చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
- వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రికి మళ్లింపు
- విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఫ్లడ్ లైట్ ల వెలుగులతో నెమ్మదిగా ముందుకు వెళుతున్న వాహనాలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో హైవేపై హెడ్ లైట్ల వెలుగులో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.