Devi Sri Prasad: 'పుష్ప 3'లో ఐటెం సాంగ్ కు ఆ హీరోయిన్ అయితే బాగుంటుంది: దేవిశ్రీ ప్రసాద్

Devi Sri Prasad on Janhvi Kapoor dance
  • ఐటెం సాంగ్ కు జాన్వీ కపూర్ అయితే బాగుంటుందన్న దేవిశ్రీ ప్రసాద్
  • శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఆమెలో ఉందని కితాబు
  • సాయిపల్లవి డ్యాన్స్ కు తాను అభిమానినని వెల్లడి
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప 2' సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా ఈ చిత్రం షేక్ చేసింది. ఈ సినిమాలో శ్రీలీల చేసిన 'కిస్సిక్' ఐటెం సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్ అయింది. 

'పుష్ప 3' కూడా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప 3'లో ఐటెం సాంగ్ కు జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 'కిస్సిక్' పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాప్యులర్ అవుతారని తమకు ముందే తెలుసని చెప్పారు. శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ కి తాను చెప్పానని తెలిపారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తన పాటల ద్వారా తొలిసారి ఐటెం సాంగ్స్ కు డ్యాన్స్ చేశారని చెప్పారు. 

సమంత, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, శ్రీలీల వీరంతా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే ఐటెం సాంగ్స్ చేశారని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. పాట ఆధారంగా హీరోయిన్ ను ఎంపిక చేస్తారని చెప్పారు. సాయిపల్లవి డ్యాన్స్ కు తాను అభిమానినని తెలిపారు. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీ కపూర్ లో ఉందని... అందుకే, రాబోయే సినిమాలో ఐటెం సాంగ్ కు ఆమే కరెక్ట్ అని తాను భావిస్తున్నానని చెప్పారు. ఐటెం సాంగ్స్ హిట్ కావాలంటే డ్యాన్స్ చాలా ముఖ్యమని అన్నారు.
Devi Sri Prasad
Janhvi Kapoor
Tollywood
Bollywood
Pushpa 3

More Telugu News