Anil Ravipudi: రాబోయే రోజుల్లో ఇలాగే వినోదాన్ని అందిస్తాన‌ని హామీ ఇస్తున్నా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్‌!

Director Anil Ravipudi Special Post on His 10 Years Cinema Journey
  • అనిల్ రావిపూడి తొలిచిత్రం ప‌టాస్‌కి నిన్న‌టితో ప‌దేళ్లు పూర్తి
  • ఈ పదేళ్లకాలంలో 8 సినిమాలను డైరెక్ట్‌ చేయగా.. అవన్నీ హిట్‌గా నిలిచిన వైనం
  • త‌న ప‌దేళ్ల సినీ కెరీర్‌పై అనిల్ రావిపూడి ఎక్స్ వేదిక‌గా స్పెష‌ల్ పోస్ట్
టాలీవుడ్‌లో యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి వ‌రుస హిట్స్‌తో దూసుకెళుతున్నారు. మొద‌టి సినిమా 'ప‌టాస్' నుంచి ఇటీవ‌ల సంక్రాంతి పండ‌క్కి వ‌చ్చిన 'సంక్రాంతికి వ‌స్తున్నాం' వ‌ర‌కు ఆయ‌న తీసిన ప్ర‌తి చిత్రం స‌క్సెస్ అయ్యాయి. దీంతో వంద‌శాతం స‌క్సెస్ రేట్ ఉన్నా డైరెక్ట‌ర్‌గా అనిల్ గుర్తింపు పొందారు. ఈ పదేళ్లకాలంలో ఆయన ఎనిమిది సినిమాలను డైరెక్ట్‌ చేయగా.. అవన్నీ హిట్‌ కావడం విశేషం.

ఇక జ‌న‌వ‌రి 23తో అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన మొద‌టి చిత్రం 'ప‌టాస్' వ‌చ్చి ప‌దేళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా త‌న ప‌దేళ్ల సినీ ప్ర‌యాణంపై ద‌ర్శ‌కుడు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. ప‌దేళ్ల క్రితం తెర‌కెక్కించిన 'ప‌టాస్' చిత్రం ఇదే తేదీన విడుద‌లై త‌న జీవితాన్ని మార్చేసింద‌ని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. 

ఈ సినిమా త‌న ద‌ర్శ‌క‌త్వానికి పునాది మాత్ర‌మే కాద‌ని ఇప్పుడు తాను ఉన్న స్థాయికి కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. వెన‌క్కి తిరిగి చూసుకుంటే ప్ర‌తిక్ష‌ణం ఒక పాఠ‌మే అని తెలిపారు. ఈ ప్ర‌యాణంలో భాగ‌మైన నిర్మాత‌లు, న‌టులు, ప్రేక్ష‌కులు అంతా త‌న కుటుంబ‌మేన‌ని అన్నారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌తిఒక్క‌రికీ ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అలాగే రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా అంద‌రికీ వినోదాన్ని అందిస్తాన‌ని హామీ ఇస్తూ ధ‌న్య‌వాదాలు తెలిపారు.
Anil Ravipudi
Tollywood

More Telugu News