కర్ణాటకలో కూరగాయల లారీ బోల్తా పడి 10 మంది రైతుల మృతి
- బుధవారం తెల్లవారుజామున ఎల్లాపూర్ తాలూకాలో దారుణం
- మరో పదిహేను మంది రైతులకు తీవ్ర గాయాలు
- మార్కెట్ కు కూరగాయలు తరలిస్తుండగా ప్రమాదం
మరో వాహనానికి దారి ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న 50 మీటర్ల లోయలో పడిపోయింది. దీంతో లారీలో కూర్చున్న రైతులు పదిమంది చనిపోగా మరో పదిహేను మంది గాయపడ్డారు. వాహనదారుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.