Padmarao Goud: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌‌కు గుండెపోటు

Padmarao Goud suffered with heart stroke
  • కుటుంబంతో డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • స్టంట్ వేసి... ప్రాణాపాయం లేదని చెప్పిన వైద్యులు
సికింద్రాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పద్మారావు గౌడ్‌కు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం తన కుటుంబం సహా ఆయన డెహ్రాడూన్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు.

ఆయనకు గుండెపోటు వచ్చిందని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పద్మారావు గౌడ్‌‌ను పరీక్షించిన వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు.
Padmarao Goud
Telangana
BRS

More Telugu News