Priyanka Chopra: చిలుకూరి బాలాజీ ఆలయంలో నటి ప్రియాంక చోప్రా ప్రత్యేక పూజలు

Priyanka Chopra offer prayers at Chilukuri Balaji Temple
  • ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ప్రియాంక చోప్రా
  • బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం అంటూ పేర్కొన్న నటి
  • రాజమౌళి-మహేశ్ బాబు చిత్రం కోసం ప్రియాంక హైదరాబాద్‌లో ఉన్నారని ప్రచారం
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ శివారులో ఉంది. స్వామివారిని వీసాల దేవుడిగా కూడా చెబుతారు. నటి ప్రియాంక చోప్రా బాలాజీని దర్శించుకొని, ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
 
Priyanka Chopra
Telangana
Chilukuru Balaji Temple

More Telugu News